: కావాల్సినన్ని నోట్లు ఉన్నాయ్... డ్రా చేసి దాచిపెట్టుకోవద్దు: ఆర్బీఐ
బ్యాంకుల్లో కావాల్సినంత డబ్బు ఉందని... అవసరం లేకపోయినా డబ్బు డ్రా చేసుకుని దగ్గర పెట్టుకోవద్దని ప్రజలను రిజర్వ్ బ్యాంక్ కోరింది. రెండు నెలల ముందు నుంచే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లనూ చేస్తూ వచ్చినందువల్ల... ఇప్పుడు ఏ సమస్య లేదని తెలిపింది. డబ్బు కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరసం లేదని చెప్పింది. డబ్బు కోసం సామాన్యులు గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది. అయితే, నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వస్తున్న వారి సంఖ్య తగ్గిందని ఐసీఐసీఐ బ్యాంక్ ఛైర్మన్ చందా కొచ్చర్ చెప్పారు. ఇప్పుడు డబ్బులు డ్రా చేసుకుంటున్న వారి వేలికి ఇంకు గుర్తు వేస్తుండటంతో, రద్దీ మరింత తగ్గిందని బ్యాంకర్లు చెబుతున్నారు.