: ఉగ్రవాదులకు నిధులు ఆగిపోయాయ్.. కశ్మీర్ లో అల్లర్లు లేవు: అమిత్ షా
నల్లధనాన్ని, అవినీతిని కట్టడి చేయడానికి పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఉగ్రవాదులకు ఫండింగ్ కూడా ఆగిపోయిందని తెలిపారు. కశ్మీర్ లో అల్లర్లు కూడా ఆగిపోయాయని చెప్పారు. అవినీతిని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తే... విపక్షాలు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.