: కొత్త డిజైన్ తో రూ. 1000 నోట్లను విడుదల చేసే ఆలోచన ప్రస్తుతం లేదు: అరుణ్ జైట్లీ
నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టడానికి పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటికే కొత్త 2000, 500 నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, కొత్త డిజైన్తో వెయ్యి రూపాయల నోట్లను విడుదల చేసే ఆలోచన ప్రస్తుతం తమకు లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చిచెప్పారు. దేశంలో ఉన్న 2 లక్షల ఏటీఎం మిషన్లలో సుమారు 22,500 ఏటీఎంలకు ఈ రోజు రూ.2000 నోట్ల కోసం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినట్లు చెప్పారు. వాటిల్లో ఇక నుంచి కొత్త రూ. 2000 నోట్లతో పాటు అన్ని నోట్లను విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు. బ్యాంకులలో పాత నోట్ల మార్పిడిని రూ. 4500 నుంచి రూ.2 వేలకు తగ్గించిన అంశంపై ఆయన మాట్లాడుతూ... అందుబాటులో ఉన్న నిధుల దుర్వినియోగం జరగకూడదనే తాము నోట్ల మార్పిడిని రూ.2000 కు తగ్గించినట్లు చెప్పారు.