: బిర్లా, సహారాల నుంచి మోదీ లంచం తీసుకున్నారు...సాక్ష్యాలివిగో: కేజ్రీవాల్
దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు చాలా గౌరవముండేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీ వద్ద పెద్ద నోట్ల రద్దుపై నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మోదీ మంచివారని దేశ ప్రజల్లాగే తాను కూడా నమ్మానని అన్నారు. అయితే ఓ సారి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు దొరికిన పత్రాల్లో ఎవరూ ఊహించని వాస్తవాలు వెల్లడయ్యాయని ఆయన చెప్పారు. ఇవన్నీ నిజమేనని నిర్ధారించుకున్న తరువాత వాటి గురించి మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. బిర్లా సంస్థ ప్రధాని నరేంద్ర మోదీకి 12 కోట్ల రూపాయలు లంచం ఇచ్చిందని ఆయన తెలిపారు. అలాగే సహారా ఇండియా సంస్థ కూడా ప్రధానికి కోట్ల రూపాయల లంచం ఇచ్చిందని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాల పత్రాలను కూడా ఆయన ప్రదర్శించారు. దీంతో మోదీ ఎలాంటి వ్యక్తో అందరూ అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు.