: ఇండోనేషియాలో భారీ భూకంపం


ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. టూరిస్ట్ ప్రదేశమైన జావా ప్రావిన్స్ లోని బాలి ద్వీపంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది. మలాంగ్ ప్రావిన్స్ కు ఆగ్నేయ దిశలో 127 కిలో మీటర్ల దూరంలో 69 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, సునామీ హెచ్చరికను జారీ చేయలేదని వారు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News