: ట్రంప్ ను కలిసే తొలి విదేశీ ప్రధాని ఈయనే!


గతంలో ఒబామాతో చేసుకున్న ఒప్పందాలను ఎక్కడ ట్రంప్ రద్దు చేస్తారోనన్న భయంతో, ఆ పరిస్థితి తలెత్తకుండా చూసుకునేందుకు జపాన్ ప్రధాని షింజో అబే నేడు అమెరికాకు కాబోయే అధ్యక్షుడిని ప్రత్యేకంగా కలవనున్నారు. దీంతో ట్రంప్ ను కలిసి ఆయనతో చర్చించే తొలి విదేశీ ప్రధానిగా అబే నిలవనున్నారు. ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన, ఈ సాయంత్రం ట్రంప్ తో సమావేశమై, ఆసియా- పసిఫిక్ రీజియన్లో ఉన్న అమెరికా సేనలను కొనసాగించేందుకు హామీని కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా, ట్రంప్ విజయం తరువాత ఆయన్ను షింజో అబే పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. తమకు పొరుగు దేశంగా ఉన్న ఉత్తర కొరియాను అదుపులో ఉంచాలంటే, అమెరికా సహకారం తప్పనిసరని షింజో అబే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్రంప్ ను కలిసేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News