: మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదాపడిన ఉభయ సభలు
పెద్దనోట్ల రద్దు అంశం పార్లమెంటును కుదిపేస్తోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ మూడోసారి వాయిదా పడింది. పెద్దనోట్ల రద్దుపై ఈ రోజు కూడా చర్చ జరగాల్సిందేనంటూ విపక్షనేతలు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పోడియంను చుట్టుముట్టడంతో సభను 12.30 వరకు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు లోక్‌సభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలోను, ఆ తర్వాత కూడా పెద్దనోట్ల రద్దుపై చర్చించాల్సిందేనంటూ విపక్షనేతలు నినాదాలు చేయడంతో స్పీకర్ సుమిత్రామహాజన్ 12.30 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.