: 'గాలి' వారి రిసెప్షన్ లో రకుల్ ప్రీత్ స్టెప్పులు... ఆఫర్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ బిజీ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ లో స్టెప్పులేసింది. రిసెప్షన్ కు వచ్చిన ఆహూతులను తన స్టెప్పులు, సోయగాలతో రకుల్ అలరించింది. తన పర్ఫార్మెన్స్ లో భాగంగా ఈ పంజాబీ ముద్దుగుమ్మ కొన్ని హిట్ సాంగ్స్ కు డ్యాన్స్ చేసింది. అయితే, ఈ పర్ఫార్మెన్స్ కు రకుల్ తీసుకున్న మొత్తం భారీగా ఉంది. ఏకంగా రూ. 2 కోట్ల రూపాయలు రకుల్ కు ముట్టినట్టు సమాచారం. పెద్ద హీరోలతో నటించిన తర్వాత, రకుల్ రెమ్యునరేషన్ రూ. కోటికి చేరింది. కానీ, దానికి డబుల్ రెమ్యునరేషన్ ను ఓ పర్ఫార్మెన్స్ కు రకుల్ తీసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.