: 3.5 కోట్లను చించి నదిలోను, డ్రైనేజీలోను పడేశారు
తమ దగ్గరున్న రూ. 500, రూ. 1000 నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక వాటిని పడేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా గౌహతిలో నగరంలోని నదితో పాటు, ఓ డ్రైనేజీలో కొట్టుకుపోతున్న దాదాపు మూడున్నర కోట్ల రూపాయలను గుర్తించారు. ఇవన్నీ రద్దైన పెద్ద నోట్లే అని పోలీసు అధికారులు తెలిపారు. అయితే, ఈ నోట్లన్నీ ఎందుకూ పనిరాకుండా ముక్కలు ముక్కలుగా చింపి నదిలోకి, డ్రైనేజీలోకి విసిరేశారని వారు వెల్లడించారు. అయితే, ఇవి దొంగ నోట్లా? లేక ఒరిజినలా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.