: జేఎన్ యూనివర్శిటీ విద్యార్ధి నజీబ్ ఆచూకీ చెబితే రూ. 5 లక్షల బహుమానం
గత నెల 15వ తేదీన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యులతో గొడవపడి, ఆపై మాయం అయిన ఎంఎస్సీ బయోటెక్నాలజీ తొలి సంవత్సరం విద్యార్థి నజీబ్ అహ్మద్ ఆచూకీ తెలిపితే తొలుత ఇస్తామన్న రూ. 2 లక్షల బహుమతిని రూ. 5 లక్షలకు పెంచుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు రోజులు గడుస్తున్న కొద్దీ మరింత క్లిష్టంగా మారుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, నజీబ్ ను వర్శిటీ క్యాంపస్ నుంచి జామియా లిల్లియా ఇస్లామియాకు తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ ను గుర్తించామని, ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తున్నామని జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ వెల్లడించారు.