: రామానంద్ సాగర్ 'రామాయణం' నటుడు ముఖేష్ రావల్ అనుమానాస్పద మృతి
బుల్లితెర సంచలనం రామానంద్ సాగర్ 'రామాయణం'లో విభీషణ పాత్రధారి ముఖేష్ రావల్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ముంబై బోరివలి రైల్వేట్రాక్ పై ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా ముఖేశ్ రావల్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ, ఘాట్ కోపర్ ప్రాంతం నుంచి డబ్బు డ్రా చేసుకుని ఇంటికి బయలుదేరిన ఆయన ఎంతకీ రాలేదని, ఆ తర్వాత ఈ విషయం తెలిసిందని వాపోయారు. కాగా, గుజరాత్ సినీ ఇండస్ట్రీలో మంచినటుడిగా గుర్తింపు పొందిన ఆయన, సత్తా, మృత్యుదాతా తదితర సినిమాల్లో నటించారు.