: బినామీ ఆస్తులపై కూడా దాడులు చేయాలి: సీఎం నితీష్ కుమార్
బినామీ ఆస్తులపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని, వీలైనంత త్వరగా దాడులు చేయాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. బీహార్ లోని మధుబని ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దుతో నకిలీ నోట్లన్నీ మాయమైపోతాయని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో పాటు ఎవరెవరి వద్ద బినామీ ఆస్తులు ఉన్నాయో వారిపై కూడా దృష్టి పెట్టాలని నితీష్ సూచించారు. పెద్దనోట్లను రద్దు చేయడంపై తాను పూర్తి మద్దతు తెలుపుతున్నానని నితీష్ మరోసారి స్పష్టం చేశారు.