: అమెరికాలో దారుణ ఘటన.. ఏడాది వయసున్న తోబుట్టువును తుపాకీతో కాల్చిన రెండేళ్ల పిల్లాడు


అమెరికాను గన్ కల్చర్ పట్టి పీడిస్తూనే ఉంది. చిన్నారుల చేతిలో తుపాకులు ఆటబొమ్మల్లా మారుతున్నాయి. బ్యాటన్‌ రౌగ్ ప్రాంతంలో చిన్నారి చేతిలో గ‌న్ ఉండ‌డంతో దారుణ ఘటన జరిగింది. ఓ షాపింగ్‌మాల్‌ వద్ద కార్ పార్క్ చేసి కారులో తమ పిల్ల‌ల‌ను వ‌దిలివెళ్లి, షాపింగ్ చేసి తిరిగి వ‌చ్చిన‌ త‌ల్లిదండ్రులు షాక్‌కి గుర‌య్యారు. త‌మ‌ రెండేళ్ల చిన్నారి ఏడాది వయస్సున్న తోబుట్టువును కాల్చేశాడని గ్ర‌హించారు. ముఖానికి తీవ్రగాయాలై బాధ‌ప‌డుతున్న‌ ఆ చిన్నారిని వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మరోపక్క. త‌మ‌ రెండేళ్ల పిల్లాడి చేతికి గ‌న్ ఎలా వ‌చ్చిందో తమకు తెలియదని త‌ల్లిదండ్రులు అంటున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

  • Loading...

More Telugu News