: దేశంలో చాలా పెళ్లిళ్లు ఆగినా.. ఆ ఇంట్లో పెళ్లి మాత్రం ధూంధాంగా జరిగింది: శరద్ యాదవ్


పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దేశంలో చాలా పెళ్లిళ్లు ఆగినా, ఆ ఇంట్లో పెళ్లి మాత్రం ధూంధాంగా జరిగిందంటూ మైనింగ్ వ్యాపారి ‘గాలి’ జనార్దన్ రెడ్డి కూతురు వివాహాన్ని ఉద్దేశించి జేడీయూ నేత శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ పెళ్లికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మీడియా ప్రచారం చేసిందని, ఈ విషయమై ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కాగా, బెంగళూరు ప్యాలెస్ లో జనార్దన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా ఈరోజు జరిగింది. పెళ్లి శుభలేఖ, పెళ్లి మండపం, అతిథులకు ఏర్పాట్లు... ఇలా ప్రతిఒక్కటీ ప్రత్యేకమంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News