: జల్లికట్టుపై తమిళనాడు పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు


తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించే జల్లికట్టు ఆట‌ను రాష్ట్ర క్రీడగా గుర్తించాలని, జల్లిక‌ట్టును నిషేధిస్తూ గ‌తంలో ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం వేసిన రివ్యూ పిటిష‌న్ ఈ రోజు సుప్రీంకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. జ‌ల్లిక‌ట్టు ర‌ద్దుపై స్టే విధించేందుకు నిరాక‌రించింది. జ‌ల్లిక‌ట్టును ఏ ప్రాతిప‌దికన రాష్ట్ర క్రీడ‌గా గుర్తించాల‌ని ప్ర‌శ్నించింది. తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన జల్లికట్టుపై నిషేధం విధిస్తూ 2014లో సుప్రీంకోర్టు తీర్పుచెప్పిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News