: ఊహించని ఆఫర్ ను పట్టేసిన నితిన్!
‘తానో సంచలన ప్రకటన చేయబోతున్నాన’ని మంగళవారం రాత్రి యువ నటుడు నితిన్ ట్వీట్ చేశాడు. టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండంతో పెళ్లి గురించి అనుకుంటారని భావించి, అది కాదని కూడా తనే చెప్పాడు. దీంతో అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూసింది. చెప్పినట్టుగానే నితిన్ ఎవరూ ఊహించని ప్రకటన చేశాడు. తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లు సంయుక్తంగా తనతో ఓ సినిమా తీయనున్నారని ప్రకటించాడు. దీనిని తన సొంత సంస్థ అయిన శ్రేష్ఠ మువీస్ పతాకం పర్యవేక్షిస్తుందని తెలిపాడు. ఈ సినిమాకు దర్శకుడు ‘రౌడీఫెలో’ సినిమా డైరెక్టర్, గీత రచయిత కృష్ణ చైతన్య కాగా, దీని ముహూర్తం కూడా పూర్తయింది. ముహూర్తానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కూడా హాజరుకావడం విశేషం.