: పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ ప్రారంభించిన మమతా బెనర్జీ


పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ర్యాలీ ప్రారంభించారు. 500, 1000 నోట్ల రద్దు కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పిలుపునిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలతో కలిసి ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా తృణమూల్ తో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన పార్టీలకు చెందిన ఎంపీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News