: విదేశాల నుంచి కుక్క పిల్లలను తేవడం ఇక కష్టం


బుజ్జి కుక్క పిల్ల ముద్దొస్తుంది అనుకుంటూ చంకన పెట్టుకుని విదేశాల నుంచి ఇక్కడకు తెచ్చుకోవడం ఇకపై అంత సులువేమీ కాదు. దీనికి సంబంధించి ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. వాస్తవంగా భారత్ లో నివసించే వారే ఇకపై అదీ రెండు కుక్క పిల్లలను తెచ్చుకోవడానికి విమానాశ్రయాలలో అనుమతిస్తారు. అదీ కాకుండా విదేశాలలో రెండేళ్లు ఉండి తమ నివాసాన్ని భారత్ కు మార్చుకుంటున్నా కుక్క పిల్లలను తెచ్చుకోవచ్చు. వీరు తప్పించి ఇక మరెవరూ కుక్కపిల్లలను తీసుకురావడానికి అనుమతి ఉండదు. పట్టుబడితే జైలు, శిక్ష, జరిమానాలు తప్పవు. కుక్కపిల్లలే కాదు ఇతర పెంపుడు జంతువులకీ ఇదే వర్తిస్తుంది.

జంతువుల అక్రమ రవాణాను నిరోధించాలని స్వచ్చంద సంస్థలు, పర్యావరణ ఉద్యమకారులు ఎన్నాళ్లుగానో కోరుతున్నందున ప్రభుత్వం ఈ మేరకు మార్పులు తీసుకొచ్చింది. ఇది ఈ నెల 15 నుంచీ అమల్లోకి వచ్చిందని ఆర్థిక మంత్రి చిదంబరం ఎంపీ మేనకాగాంధీకి లేఖ ద్వారా తెలియజేశారు.

  • Loading...

More Telugu News