: ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోను!: కోర్టుకు తెలిపిన రాహుల్ గాంధీ
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని భివాండీ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహాత్మ గాంధీని హత్య చేయించింది ఆర్ఎస్ఎస్ అని వ్యాఖ్యానించడంపై ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నిమిత్తం ఆయన భివాండీ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని రాహుల్ గాంధీ న్యాయస్థానానికి తెలిపారు. దీంతో కేసు విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసిన న్యాయస్థానం, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.