: వైఎస్ జగన్, హీరో సుమంత్ జిగిరీ దోస్తులట... తాత అక్కినేనికి పట్టుబడిన వేళ... సుమంత్ చెప్పిన మధురజ్ఞాపకం!


వైఎస్ జగన్ తో కలసి దొంగతనంగా తన బెడ్ రూంలోకి వెళ్లబోతూ, తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుకు అడ్డంగా దొరికిపోయామని, దాదాపు 25 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను నటుడు సుమంత్ పంచుకున్నాడు. చాలా మందికి తెలీని విషయాలు వెల్లడిస్తూ, జగన్, తాను చాలా మంచి మిత్రులమని, ఒకే క్లాసులో, ఒకే బెంచీలో కూర్చుని చదివామని, కలసి అల్లరి చేశామని చెప్పుకొచ్చాడు. ఓ టీవీ చానల్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న సుమంత్, చిన్న నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఓ రోజు రాత్రి పొద్దుపోయే వరకూ కలిసి తిరిగామని, ఆపై జగన్ తన ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని చెబుతూ, పైనున్న బెడ్ రూమ్ కు దొంగతనంగా వెళ్లేందుకు తాను మొదట గ్రిల్ పట్టుకుని ఎక్కుతుండగా తాతయ్య చూశారని చెప్పాడు. ఆ సమయంలో గ్రిల్ పట్టుకుని వేలాడుతూనే "తాతా... అతని పేరు జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖరరెడ్డ గారి కొడుకు" అంటూ పరిచయం చేశానని చెప్పుకొచ్చాడు. ఆనాటి రోజుల్ని తాను, జగన్ ఎంతో ఎంజాయ్ చేశామని వివరించాడు.

  • Loading...

More Telugu News