: నా కిడ్నీలు విఫలమయ్యాయి... నన్ను ఆ శ్రీకృష్ణుడే కాపాడాలి!: ఆందోళన కలిగిస్తున్న సుష్మా స్వరాజ్ ట్వీట్


తన అభిమానులకు, బీజేపీ కార్యకర్తలకు ఆందోళన కలిగించేలా తాను మూత్ర పిండాల వ్యాధితో బాధపతుతున్నానని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ప్రస్తుతం తనకు డయాలసిస్ జరుగుతోందని, ఇందుకోసం తాను ఎయిమ్స్ కు వెళ్లి వస్తున్నానని తెలిపారు. మూత్రపిండాల మార్పునకు పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. తన రెండు కిడ్నీలూ విఫలమయ్యాయని, కనీసం ఒక కిడ్నీ మార్చాల్సి వుందని వైద్యులు స్పష్టం చేశారని వెల్లడించిన సుష్మా స్వరాజ్ తన ఆరోగ్యంపై ఎలాంటి దిగులు చెందవద్దని కార్యకర్తలకు చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమె ట్వీట్ చేశారు. శ్రీ కృష్ణ భగవానుడు తనను కాపాడతాడన్న నమ్మకముందని అన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై రీ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News