: నోట్ల రద్దు అత్యంత రహస్యం... ముందు చెప్పాలనడం తెలివితక్కువతనం: వెంకయ్యనాయుడు


కరెన్సీ నోట్లను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం అత్యంత రహస్యమైనదని, దాన్ని ముందుగానే చెప్పి, ప్రజలను సిద్ధం చేయాలని విపక్షాలు ఆరోపిస్తూ ఉండటం తెలివి తక్కువతనమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు. నోట్లను రద్దు చేస్తున్న విషయం 8వ తేదీ సాయంత్రం వరకూ అత్యధిక మంత్రులకే తెలియదని, సమావేశం పెట్టి, వారికి వెల్లడించిన తరువాతనే ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడారని ఆయన తెలిపారు. ఏ మాత్రం ముందుగా విషయం బయటకు పొక్కినా, అక్రమార్కులు జాగ్రత్త పడిపోయేవారని, అప్పుడు మొత్తం ప్లాన్ బెడిసికొట్టేదని అన్నారు. నోట్ల రద్దు తరువాత ప్రజలు కొన్ని కష్టాలు పడుతున్న మాట వాస్తవమేనని, అన్ని సమస్యలనూ అతి త్వరలో పరిష్కరిస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News