: నేనేమీ మోదీలా మాట్లాడను, ఆయన తల్లిపై కామెంట్ చేయను: రాహుల్ గాంధీ సెటైర్


తన వద్ద ఉన్న పాత కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ, బ్యాంకుకు వెళ్లి, తన వంతు వచ్చే వరకూ వేచి చూసి నోట్లను మార్చుకోవడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. తాను బ్యాంకుకు వెళ్లిన వేళ తనను విమర్శించిన మోదీని ప్రస్తావిస్తూ, "నేను మోదీలా కాదు. ఆయన తల్లిపై నేను ఎటువంటి కామెంట్లూ చేయను" అని ముంబైలో ఓ కేసులో విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన ఆయన వ్యాఖ్యానించారు. గత వారంలో రాహుల్ ఓ బ్యాంకు వద్దకు వెళ్లి నోట్లను మార్చుకున్న వేళ, 2జీ, బొగ్గు స్కాం పెద్ద పెద్ద కుంభకోణాల్లో భాగం పంచుకున్న వారు, ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారని విమర్శించిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిగా రాహుల్ ఈ ఎదురుదాడి చేశారు.

  • Loading...

More Telugu News