: 'గాలి' వారి వివాహ వేడుకపై పిటిషన్ వేసిన సామాజిక కార్యకర్త
70 ఎకరాల బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహ వేడుకపై సామాజిక కార్యకర్త నరసింహమూర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజభోగాలతో, అంగరంగవైభవంగా నిర్వహిస్తున్న ఈ వివాహానికి 650 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. కేవలం ఆహ్వాన పత్రికకే 6 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా, విజయనగర రాజుల వైభవాన్ని తలపించేలా వేసిన సెట్టింగులు, తిరుపతి నుంచి వచ్చిన వేదపండితులు, వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, మద్దతుదారుల సాక్షిగా హంపి విఠలాలయ రూపంలో డిజైన్ చేసిన కల్యాణ మండపంలో ఈ వివాహం జరుగుతోంది.