: నరేంద్ర మోదీ లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరపాలని ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం


ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో లంచం తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపించాలని ఢిల్లీ అసెంబ్లీ తీర్మానించింది. పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చించడానికి సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచగా, మొత్తం 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో 67 మంది ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులే కావడంతో తీర్మానానికి తిరుగులేకుండా పోయింది. అంతకుముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ, మోదీ రూ. 12 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించారు. పన్ను ఎగవేత, అవినీతి తదితరాలకు సంబంధించి ఆయన కార్యాలయం నుంచి సీజ్ చేసిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని తెలిపారు. 2013లో ఆదిత్య బిర్లా గ్రూప్ కార్యాలయంపై దాడులు జరిగిన తరువాత ఆదాయపు పన్ను విభాగం సీజ్ చేసిన డాక్యుమెంట్లలో సీఎంకు రూ. 25 కోట్లు లంచం ఇచ్చేందుకు నిర్ణయించి రూ. 12 కోట్లు ఇచ్చినట్టుగా ఉందని కేజ్రీవాల్ వెల్లడించారు. కాగా, ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కేజ్రీవాల్ ఈ తరహా చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించింది.

  • Loading...

More Telugu News