: కార్నివాల్ ను తలపించిన గాలి వారి పెళ్లి సందడి


ప్రముఖ వ్యాపారావేత్త గాలి జనార్దనరెడ్డి కూతురు వివాహ వేడుక కార్నివాల్ ను తలపిస్తోంది. బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఈ వివాహం జరుగుతోంది. రాజభోగాలతో వివాహం జరుగుతోంది. విజయనగర రాజుల వైభోగాన్ని తలపించేలా సెట్టింగులు ఏర్పాటు చేశారు. హంపి విఠలాలయ రూపంలో కళ్యాణ మండపం, తోరణాలు ఆహూతులను అలరించాయి. రష్యన్ డాన్సర్లతో కార్నివాల్ ను తలపించే రీతిలో వేడుక నిర్వహించారు. టాలీవుడ్, బాలీవుడ్ గాయకులతో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకలో ప్రముఖ సినీ నటుడు సుమన్ తదితరులు పాల్గొనడం విశేషం. ఈ వివాహం భారీ బడ్జెట్ తో జరుగుతోందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుండగా, 56 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చుచేస్తున్నామని గాలి కుటుంబం పేర్కొనడం విశేషం. తిరుపతి నుంచి ప్రత్యేకంగా వచ్చిన వేదపండితులు ఈ వివాహం నిర్వహించడం విశేషం. కర్ణాటక చరిత్రలో ఇలాంటి వివాహం జరగలేదని, 50,000 మందికి ఆహ్వానం అందిందని సమాచారం.

  • Loading...

More Telugu News