: అధికారంలో ఉంటే ప్రజలను అవమానిస్తారా?: బీజేపీ నేతలపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్


'అధికారంలో ఉంటే ప్రజలను అవమానిస్తారా?' అని బీజేపీ నేతలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, 'రేషన్ షాపుల ముందు, సినిమా టికెట్ల కోసం, జియో సిమ్ ల కోసం క్యూలైన్లలో నిల్చోలేదా? ఇక్కడ నిల్చుంటే కష్టంగా ఉందా? దేశం కోసం ఆమాత్రం చేయలేరా?' అని చాలా మంది బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని... పైన చెప్పిన ప్రతి పనిలోనూ ఇష్టమున్నవారు నించున్నారు, ఇష్టం లేని వారు నించోలేదని, ఇప్పుడు ప్రభుత్వం బలవంతంగా ప్రతి ఒక్కరినీ క్యూలో నించోబెడుతోందని ఆయన మండిపడ్డారు. కేవలం 20 శాతం మంది కోసం 80 శాతం మందిని ఇబ్బంది పెట్టడం తప్ప మరో మార్గం లేదా? అని ఆయన నిలదీశారు. అలాంటి మార్గాలు చేపట్టకుండా ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News