: పాకిస్థాన్ లో పెద్దనోటు రద్దు వదంతులు
భారత్ లో అవినీతిని, నల్లధనవంతులను, నకిలీ కరెన్సీ రాకెట్లను అరికట్టే క్రమంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మన పొరుగు దేశమైన పాకిస్థాన్ లో కూడా పెద్దనోటు ఒక దానిని రద్దు చేస్తారంటూ వదంతులు వ్యాపించాయి. అక్కడి పెద్దనోటు అయిన రూ.5,000ను పాక్ ప్రభుత్వం రద్దు చేయనుందని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పాక్ ఆర్థిక శాఖ మంత్రి ఇషక్ డర్ మాట్లాడుతూ, ఆ వార్తలన్నీ వదంతులేనని చెప్పారు. ట్యాక్స్ రీఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (టీఆర్ఐసీ) నుంచి 2016-17 బడ్జెట్ లోపు పెద్ద నోట్లు రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే కానీ, దీనిపై నిర్ణయం వాయిదా పడిందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రత్యేక సహాయకుడు హరూన్ అక్తర్ ఖాన్ మీడియాకు వెల్లడించారు.