: మమతా బెనర్జీ ర్యాలీలో పాల్గొననున్న ‘శివసేన’


పెద్దనోట్ల రద్దుపై నిరసన వ్యక్తం చేస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీకి శివసేన పార్టీ మద్దతు తెలిపింది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ పార్లమెంట్ హౌస్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ జరగనుంది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు విషయం అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సమస్య కాదని, ఇది ప్రజల సమస్య అని అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మాత్రం ఈ ర్యాలీలో పాలు పంచుకోవడం లేదన్నారు.

  • Loading...

More Telugu News