: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. నిర్ణయాలు ఇవిగో!


నాలుగు గంటలపాటు కొనసాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ కోసం 10 లక్షల సెట్ టాప్ బాక్సులను కొనుగోలు చేయాలని, విజయవాడ సిద్ధార్థ కాలేజ్ భూముల లీజు ధరను పెంచాలని, పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్రం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం ఏపీటీటీసీకి అప్పగింతకు, విశాఖ ఉడా పరిధిలో పూలింగ్ స్కీమ్ కు, సీఆర్డీఏ పరిధిలో అమృత యూనివర్శిటీకి 200 ఎకరాలు, ఆర్బీఐ కి 11 ఎకరాలు, సీపీడబ్ల్యూకు 28 ఎకరాల భూమి కేటాయింపునకు, పల్స్ సర్వే బాధ్యతలను నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలకు, అగ్రిగోల్డ్ కేసు పురోగతిపై ప్రతి కేబినెట్ భేటీలో చర్చించేందుకు, అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

  • Loading...

More Telugu News