: గేమ్ ప్లాన్ తో కోహ్లీకి షాకిచ్చిన కుక్!


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ షాకిచ్చాడు. తొలి టెస్టులో అన్ని విభాగాల్లోను రాణించిన ఇంగ్లండ్ జట్టు మ్యాచ్ లో ఫలితం తేలదని తెలిసినప్పటికీ, చివరి రోజు సాయంత్రం ఆటను ముుగించేందుకు ముందుగా కుక్ అంగీకరించలేదు. అయితే కోహ్లీ 49 పరుగుల వద్ద ఉండగా, అతని వద్దకెళ్లిన కుక్ డ్రా ప్రతిపాదన చేశాడు. దీంతో కోహ్లీ డ్రాకు అంగీకరించాడు. అయితే మరొక్క పరుగు చేసి ఉంటే కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తయి ఉండేది. ఇది కుక్ గేమ్ ప్లాన్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఆటగాడు అర్ధ సెంచరీ లేదా సెంచరీ పూర్తి చేసిన అనంతరం ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుంటారు. ఇది మిగిలిన ఆట కొనసాగించేందుకు సరిపడా స్థైర్యాన్ని ఇస్తుంది. అలా కాకుండా అర్ధ సెంచరీ ముందు అవుటైనా, లేదా మ్యాచ్ ముగిసినా ఆటగాడిలో ఒక వెలితి అలాగే ఉండిపోతుంది. ఈ నిరాశ తరువాతి ఆటపై ప్రభావం చూపిస్తుంది. కోహ్లీకి అలాంటి అనుభవాన్ని మిగిల్చేందుకే కుక్ కీలకమైన సమయంలో డ్రా ప్రతిపాదన చేశాడు. దీంతో ఇన్నింగ్స్ ముగిసింది.

  • Loading...

More Telugu News