: కొంచెం ఇబ్బంది ఉన్నా... తక్కువ డబ్బుతో ఎలా గడపాలో అనుభవం వస్తుంది: మేరీకోమ్


రూ. 500, రూ. 1000 నోట్ల రద్దును ప్రముఖ బాక్సర్, రాజ్యసభ సభ్యురాలు మేరీకోమ్ సమర్థించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని తెలిపింది. దీని వల్ల ప్రజలు కొన్ని రోజుల పాటు ఇబ్బందులు పడినా... అతి తక్కువ డబ్బుతో ఎలా గడపాలో కొత్త అనుభవం వస్తుందని చెప్పింది. ప్రధాని మోదీ ధైర్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ భవిష్యత్తు బాగుంటుందని తెలిపింది.

  • Loading...

More Telugu News