: సచిన్ కు మరపురాని రోజు నేడు!


నవంబర్ 15వ తేదీ... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు బాగా గుర్తుండే రోజు. సరిగ్గా 27 ఏళ్ల క్రితం 1989లో నవంబర్ 15న టెస్ట్ క్రికెట్లో సచిన్ ఆరంగేట్రం చేశాడు. పాకిస్థాన్ లోని కరాచీ నేషనల్ స్టేడియంలో సచిన్ తన తొలి టెస్టు ఆడాడు. 16 ఏళ్ల 205 రోజుల వయసులో సచిన్ తన తొలి టెస్టు ఆడాడు. ఇదే మ్యాచ్ ద్వారా భారత బౌలర్ సలీల్ అంకోలా, పాక్ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్, మరో ఆటగాడు షాహిద్ సయీద్ లు కూడా టెస్టుల్లోకి అడుగుపెట్టారు. ఈ మ్యాచ్ లో సచిన్ ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. 15 పరుగులు చేసిన తర్వాత వకార్ యూనిస్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

  • Loading...

More Telugu News