: హుండీల్లోని చిన్ననోట్లను, చిల్లరను తక్షణం బ్యాంకుల్లో జమ చేయాలని ‘కేంద్రం’ ఆదేశాలు
ఆలయాల హుండీల్లో చిన్ననోట్లను, చిల్లరను తక్షణం బ్యాంకుల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశా వ్యాప్తంగా ఉన్న ఆలయాల హుండీల్లో భక్తులు సమర్పించే చిల్లరను వెంటనే బ్యాంకుల్లో జమ చేయాలని ఆలయ ట్రస్టులకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ సూచించారు. ఆలయాలకు విరాళాలుగా ఇచ్చే డబ్బులో ఎక్కువ శాతం చిన్న నోట్లే ఉంటాయని, ఆ మొత్తాలను వెంటనే బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని అన్నారు. కాగా, పెద్దనోట్ల రద్దు, ఏటీఎంల ద్వారా తగినన్ని వంద నోట్లు ప్రజలకు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో దేశంలో చిన్ననోట్లు, చిల్లర దొరకకపోవడంతో శక్తికాంత్ దాస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.