: మళ్లీ మళ్లీ బ్యాంకులకు రాకూడదు.. ఖాతాదారులకు ప్రత్యేక ఇంక్‌తో వేలిపై గుర్తులు పెడతాం: శక్తికాంత దాస్
బ్యాంకుల నుంచి డబ్బు తీసుకున్న ఖాతాదారులే మళ్లీ మళ్లీ వస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్యాంకుల ముందు ప్రజలు పడుతున్న కష్టాలను గురించి ఆయన మాట్లాడుతూ... భారీగా బ్యాంకుల ముందుకు ఖాతాదారులు వస్తోన్న అంశంపై తాము విశ్లేషించినట్లు చెప్పారు. బ్యాంకుల వద్ద క్యూ లైన్లు మరింత పెరిగాయన్న సమాచారం అందిందని, తరుచూ కొంత మంది ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లి డబ్బు తీసుకోకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్ల వేలికి ఇంకు గుర్తులు పెట్టినట్లు ఖాతాదారులకు కూడా ప్రత్యేక ఇంక్‌తో వేలిపై గుర్తులు పెడతామని చెప్పారు. దీని వల్ల డబ్బు ఇంతవరకూ అందుకోని ఖాతాదారులు నగదు అందుకునేందుకు వీలుగా ఉంటుందని చెప్పారు.