: ‘పెద్దనోట్ల రద్దుపై ఎలా పోరాడదాం?’.. సోనియా నివాసంలో కాంగ్రెస్ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం
రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ రోజు ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశానికి ఇప్పటివరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆనందర్ శర్మ, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఇతర విపక్షాలతో కలిసి పోరాడేందుకు కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. ప్రభుత్వంపై పోరాటానికి అన్ని విపక్షాలు ఏకమవుతున్న వేళ కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే అంశంపైనే ప్రధానంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.