: అక్షయ్ కుమార్ ను అనుమానించిన డింపుల్ కపాడియా!
ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో పలువురు హీరోయిన్లతో అఫైర్లు నడపడంలో సిద్ధహస్తుడని పేరుపడ్డాడు. ప్రధానంగా శిల్పాశెట్టి, అక్షయ్ మధ్య అనుబంధం ఎన్నో ఏళ్లపాటు అభిమానుల నోళ్లలో నానింది. తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విషయంలో అతని భార్య వార్నింగ్ ఇచ్చిందంటూ వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్షయ్, ట్వింకిల్ ఖన్నా కలసి 'కాఫీ విత్ కరణ్' షోలో తమ వివాహానికి దారితీసిన పరిస్థితులను బయటపెట్టారు. అమీర్ ఖాన్ తో 'మేళా' సినిమా షూటింగ్ లో ఉండగా అక్షయ్ తనకు ప్రపొజ్ చేశాడని ట్వింకిల్ చెప్పింది. అప్పుడేం చేయాలో పాలుపోని తాను... ఈ సినిమా హిట్ అయితే తన కెరీర్ ఊపందుకుంటుందని, ఫ్లాప్ అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. అక్షయ్ కోరుకున్నట్టే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అక్షయ్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ట్వింకిల్ తన తల్లి డింపుల్ కపాడియాకు తెలిపింది. దీంతో 'అక్షయ్ గురించి విన్నాను, అతను 'గే' అటకదా? అని అడిగి, ఏడాది డేటింగ్ చేసిన తరువాత నచ్చితే వివాహం చేసుకో' అని చెప్పిందని ట్వింకిల్ తెలిపింది.