: చలామణిలో లేని కరెన్సీ ఉందని మనస్తాపంతో యువతి ఆత్మహత్య


పాతనోట్ల రద్దు ప్రభావం దేశంలోని అన్ని వర్గాల వారిపై పడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలోని ముజఫర్‌నగర్‌లో తాజాగా విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువ‌తి త‌న‌కు చెల్లుబాటులో ఉన్న నోట్లు దొర‌క‌వేమోన‌ని బాధ‌ప‌డి, ఆ ఒత్తిడిలో ఆత్మ‌హ‌త్య చేసుకుంది. నగదు మార్చుకోవడానికి త‌న‌ తమ్ముడిని బ్యాంకుకు పంపిన షబానా (20) తన త‌మ్ముడు బ్యాంకుకు వెళ్ల‌గానే ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది. తన చికిత్సకు తగినంత కొత్త నోట్లు ల‌భించ‌వేమోన‌నే ఆమె ఈ ప‌నిచేసిన‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యులు చెప్పారు. ష‌బానా తమ్ముడు మొబిన్‌ బ్యాంకు వద్దకు నగదు మార్చుకోవడానికి వెళ్లి, డ‌బ్బు మార్చకుండానే ఇంటికి తిరిగి వ‌చ్చాడు. ఇంత‌లో త‌న అక్క‌ ఆత్మ‌హ‌త్య చేసుకొని క‌నిపించడంతో బోరుమని విలపించాడు.

  • Loading...

More Telugu News