: రైల్వే ప్రయాణికులకు శుభవార్త...ఈ నెల 24 వరకు 500, 1000 నోట్లు చెల్లుతాయి!
500, 1000 రూపాయల నోట్ల రద్దుపై ఇండియన్ రైల్వేస్ సానుకూల నిర్ణయం తీసుకుంది. నోట్ట రద్దు కారణంగా ప్రయాణాలు, అత్యవసర సేవల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే రిజర్వేషన్లు, టికెట్ల కొనుగోలు, రైల్వే క్యాటరింగ్ సర్వీసుల్లో పాత నోట్లను తీసుకోవాలని నిర్ణయించారు. రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లను ఈ నెల 24 వరకు అనుమతించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. వాస్తవానికి ఈ నోట్లను నేటి అర్ధరాత్రి వరకూ అనుమతిస్తూ గతంలో నిర్ణయించాగా, తాజాగా దానిని ఈ నెల 24 వరకు పొడిగించడం విశేషం.