: చంద్రబాబు, అంబానీలాంటి వాళ్లు ముందే సర్దుకున్నారు: రోజా


పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీలాంటి వాళ్లకు ముందే తెలుసని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. దీంతో, వారు ముందుగానే జాగ్రత్తపడి, సర్దుకున్నారని అన్నారు. సామాన్యుడు మాత్రం ఈ నిర్ణయంతో అనేక బాధలు పడుతున్నాడని తెలిపారు. డబ్బు కోసం గంటల సేపు బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడాల్సి వస్తోందని చెప్పారు. అంతసేపు క్యూలో నిలబడ్డా... కౌంటర్ వద్దకు వెళ్లేసరికి డబ్బు ఉంటుందో లేదో అర్థంకాని పరిస్థితి నెలకొందని తెలిపారు. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి నేడు డబ్బులు కూడా లేని పరిస్థితి ఎదురైందని అన్నారు.

  • Loading...

More Telugu News