: బ్యాంకర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, ఆర్‌బీఐ అధికారులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. పెద్ద నోట్ట రద్దు ప్రభావ పరిస్థితులను అధికారులు పరిశీలిస్తూ ఉండాలని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో రూ.50 నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రైతు బజార్లలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, పరిస్థితులపై బ్యాంకు, ఆర్‌బీఐ అధికారులు వేగంగా స్పందించాలని సూచించారు. రూ. 500 నోట్లను అందుబాటులోకి తేవాలని చెప్పారు.