: భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు మృతి చెందారన్న పాకిస్థాన్
భారత సైన్యం పీవోకేలోకి ప్రవేశించి అక్కడి ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసిన అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ రేంజర్లు జరుపుతున్న కాల్పులకు భారత జవాన్లు దీటుగా సమాధానం చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, నియంత్రణరేఖ వద్ద నిన్న రాత్రి భారత సైన్యం కాల్పులు జరిపిందని పాకిస్థాన్ అధికారులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఏడుగురు పాకిస్థాన్ రేంజర్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ అంశంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.