: విజయవాడలో యాక్సిస్ బ్యాంకు ముందు ధర్నా, ఉద్రిక్తత


తక్షణమే అన్ని ఏటీఎంలనూ తెరవాలని, బ్యాంకుల్లో రోజువారీ కార్యకలాపాలన్నీ జరిపించాలని డిమాండ్ చేస్తూ, విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగగా, అప్పటికే గంటల తరబడి క్యూలైన్లలో వేచివున్న ప్రజలు కూడా మద్దతు పలకడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఏలూరు రోడ్డులోని యాక్సిస్ బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులను కష్టాల పాలు జేశారని విమర్శించారు. కాల్ మనీ కేసుల్లో ఉన్నవాళ్లు, ఇసుక కేసుల్లో ఉన్నవాళ్లు, తెలుగుదేశం నేతలందరికీ నోట్ల రద్దుపై ముందే ఉప్పందిందని, వారంతా తమ డబ్బును మార్చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వీరి ధర్నా సందర్భంగా అవాంఛనీయ పరిస్థితి తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

  • Loading...

More Telugu News