: కడప జిల్లాలో కలకలం.. టీడీపీ కార్యకర్తపై బాంబులు, వేటకొడవళ్లతో ప్రత్యర్థుల దాడి
కడప జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ కోరలు చాచింది. పులివెందులలోని నామాలగుండు దగ్గర ఈ కలకలం రేగింది. ఓ కేసు విషయంలో రేపు పులివెందుల కోర్టులో సాక్షమివ్వడానికి హాజరుకానున్న శంకరప్ప అనే టీడీపీ కార్యకర్తపై ప్రత్యర్థులు బాంబులు, వేటకొడవళ్లతో దాడికి దిగారు. దీనిని గమనించిన నామాలగుండులోని భక్తులు ఆందోళనతో గట్టిగా అరుపులు పెట్టారు. దీంతో బెదిరిపోయిన దుండగులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ప్రత్యర్థుల దాడిలో శంకరప్ప తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయన అనంతపురం జిల్లా తలుపుల మండలంలోని వేల్పుల గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.