: ఏకంగా ఆరు లక్షల రూపాయల కొత్త కరెన్సీ తీసుకున్న వ్యక్తి... కేసు నమోదు
దేశవ్యాప్తంగా రద్దయిన పెద్ద నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ఈ రోజు కూడా ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. తెలంగాణలో ఈ రోజు బ్యాంకులు తెరచుకోని విషయం తెలిసిందే. అయితే, తాజాగా, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ సిండికేట్ బ్యాంకు శాఖలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద నోట్లను మార్చిన బ్యాంకు సిబ్బందిపై సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఒకేసారి బ్యాంక్ లో అదే బ్యాంకులో క్లర్క్ గా పనిచేస్తున్న మల్లేశం అనే వ్యక్తి రూ.6 లక్షల కొత్త కరెన్సీ తీసుకున్నట్లు పోలీసులకి తెలిసింది. మల్లేశంతో పాటు ఆ నోట్లు ఇచ్చిన బ్యాంకు క్యాషియర్‌పై 420, 406, 417 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.