: హవ్వ... ఆశ్లీల చిత్రాలు చూసిన మంత్రికి క్లీన్ చిట్ ఇస్తారా?: దేవెగౌడ


మొబైల్ ఫోన్ లో ఆశ్లీల చిత్రాలు చూస్తూ కర్ణాటక మంత్రి తన్వీర్ సేఠ్ అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఈ తతంగాన్ని షూట్ చేసిన కెమెరామెన్, రిపోర్టర్లపై తన్వీర్ సేఠ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, నివేదికను పరిశీలించాకే చర్యలు తీసుకున్నామని చెప్పారు. తాను తన్వీర్ తో మాట్లాడానని... ఏ తప్పూ చేయలేదని ఆయన తనతో చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడుతూ, ఆశ్లీల చిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్కైన మంత్రికి క్లీన్ చిట్ ఇస్తారా? అంటూ మండిపడ్డారు. దీనిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తన్వీర్ వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సిద్ధరామయ్యకు సూచించారు. మరోవైపు, తన్వీర్ సేఠ్ రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రాయ్ చూర్ లో టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తన్వీర్ సేఠ్ తన మొబైల్ లో ఆశ్లీల చిత్రాలు చూస్తూ బుక్కయ్యారు.

  • Loading...

More Telugu News