: అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు ఏపీ వాసులు సజీవ దహనం
అమెరికాలోని డాలస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సజీవ దహనమయ్యారు. నెల్లూరు జిల్లా ఏఎన్‌పేట మండలం పెద్దబ్బిపురానికి చెందిన దంపతులు పార్థసారథి, లీలావతి గత కొంత కాలంగా డాలస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో వీరు మృతి చెందారు. వారి మృతి వార్త తెలిసి స్వగ్రామం పెద్దబ్బిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను దేశానికి తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై మరింత సమాచారం అందాల్సి ఉంది.