: స్త్రీ, పురుషులకు ఒకే టాయిలెట్.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో సరికొత్త ప్రయోగం
సాధారణంగా స్త్రీ పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లు ఉంటాయి. అయితే ఇద్దరికీ ఒకే టాయిలెట్‌ను అందుబాటులోకి తెస్తూ వినూత్న ప్రయోగానికి తెరతీసింది బ్రిటన్‌లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ. ప్రపంచంలోనే తొలిసారి ఇద్దరికీ ఒకే టాయిలెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. టాయిలెట్ డోర్లపై ఉన్న చిహ్నాల ఆధారంగా ఉపయోగించుకునేలా వాటిని రూపొందించింది. గతనెలలోనే అందుబాటులోకి తెచ్చిన ఈ ప్రయోగాత్మక టాయిలెట్ల విధానానికి విద్యార్థులు కూడా ఓకే చెప్పినట్టు యూనివర్సిటీ పేర్కొంది. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో యూనివర్సిటీ ఇతర కళాశాలల్లోనూ ఇదే విధమైన టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది.