: మోదీ వార్నింగ్ ఫలితాన్నిస్తోంది... రోడ్డుపై కోటి రూపాయలు వదిలి పరారైన అక్రమార్కులు!


ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నిర్ణయం నల్లధనాన్ని దాచుకున్న అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయడమే కాదు, ఏదైనా ప్రయత్నాలు చేసి ఆ డబ్బును వైట్ మనీగా చేద్దామనుకున్నా కుదరనీయడం లేదు. తాజాగా కోటి రూపాయలకు పైగా నల్లధనాన్ని తరలిస్తున్న ఓ ముఠా పంజాబ్ రాష్ట్రంలోని మున్సా సమీప ప్రాంతం సర్దుల్ గఢ్ వద్ద పోలీసులకు పట్టుబడింది. పాత 500, 1000 రూపాయల నోట్లతో వెళుతున్న వ్యక్తులు పోలీసులను చూడగానే కారును అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News