: వైజాగ్ మురుగు కాల్వలో 500, 1000 నోట్లు... పోటీపడ్డ స్థానికులు


విశాఖపట్టణంలో బ్లాక్ మనీ కలకలం రేగింది. విశాఖపట్టణంలోని హెబీకాలనీ, భానునగర్ ప్రాంతంలోని మురుగు కాల్వలో 500, 1000 రూపాయల నోట్లు స్థానికులకు కనిపించాయి. దీంతో వాటిని దక్కించుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ క్రమంలో నోట్లు ముక్కలైపోయాయి. ఎవరికీ పూర్తి నోట్లు దక్కకపోవడం విశేషం. అక్కడ జరిగిన చిన్నస్థాయి యుద్ధంలో నోట్లన్నీ చిరిగిపోయాయి. దీంతో వారంతా నిరాశచెందారు. బ్లాక్ మనీ అక్కర్లేదని కొంత మంది పారేస్తుంటే... వాటిని దక్కించుకునేందుకు సామాన్యులు పోటీ పడడం వంటి పూర్తి వైరుధ్యవాతావరణం వైజాగ్ లో కనిపించింది.

  • Loading...

More Telugu News